Monday, August 6, 2007

నా సొంత గూడు


ఎదొ చిన్న చిన్న ఫొటొ లు తీయటం తొ మొదలయ్యిన హాభి ఇప్పుడు వ్యసనం అయ్యింది.4 సంవత్సరాల క్రితం www.photo.net చూసి అచ్చెరు పొంది, ఎప్పటికయినా అలాంటి ఫొటొలు తియ్యలి అని చెప్పి, నా హాభి కి క్రొత్త బాష్యం చెప్పటం మొదలుపెట్టాను. క్రొత్త పాటాలు నేర్చుకున్నను, ఇంకా నేర్చుకూంటున్నను కూడా. మంచి ఫొటొ తియ్యటానికి మంచి అలొచనా, వెలుతురిని చదవగల నేర్పు వుంటె చాలు అని నా అభిప్రాయం. వీటికి మంచి కెమెరా తొడు అవ్వితే, మంచి ఫొటొ కాస్తా, గొప్ప ఫొటొ గా మారుతుంది అనేది కూడ నా అభిప్రాయం.

కూడలి తొ పరిచయం , ఇక్కడ ఫొటొలు చూసి, నాకు కూడా నా హాభిని అందరితొ పంచుకుందాము అని పుట్టిన కొరిక నా ఈ బ్లాగు.
ఈ బ్లాగు కి ఇంక చరమ గీతం పాడదాము అనుకుంటున్నాను. మొదలు పెట్టి ఇంకా నెల రొజులు కాక ముందే అప్పుడే ముగింపు చెప్పటం నాకు బాధ గా వున్నా, నా సొంతగూడు కి వెళుతున్నందుకు నాకు అనందమ్ గా కూడా వుంది. అపార్టుమెంటు బ్రతుకు లాగ నాకు కావలిసినట్టు నా బ్లాగు ని మార్చుకొనే అవకాసం లేకపొవడం నా చేతులని కట్టిపడేసింది . దానికి తొడు నా మనస్సులొ ఎప్పటి నుండొ వున్న ఒక చిన్న కొరిక నా సొంత గూడు. దానికి తుది రూపు గత కొద్ది వారాలుగా ఇస్తువున్నాను.చివరికి నిన్న గృహప్రవేశం చేసాను.

నన్ను ఈ బ్లాగు తొ అభిమానించిన మీ అందరికి నా ధన్యవాధములు. మీరు నన్ను నా సొంత గూడు లొ కి వెళ్ళినా కూడా ఇదే అదరాభిమానాలు చూపిస్తారు అని ఆశిస్తు, నా కొత్త గూడు ని మీకు పరిచయం చేస్తున్నాను. దయ చేసి మీరు ఒక్కసారి నా గూడు ని చూపు చూసి మరల మరల చూస్తూ వుంటారు అని కొరుకుంటున్నను. మీ browsers లొ bookmark చేసుకొండి. https://www.udaypratti.com

Thursday, July 26, 2007

ప్రాణం లేదు కాని, ఫొటొ కి జీవం వచ్చింది.




ఈ మధ్య ఒక నది ఒడ్డ్డున కూర్చుని చుట్టు వున్న ప్రకృతి ని ఆస్వాదిస్తు వుండగా, అ ప్రకృతి అందాన్ని వెక్కిరిస్తున్నట్టు గా నది అంచున వున్న ఈ దుంగ నాకు ఎందుకొ మంచి contrast అనిపించింది.మీకు నచ్చినా, నచ్చక పొయినా, ఒక చిన్న మాట కామెంట్ల లొ వదలండి.

Thursday, July 19, 2007

గగన వీక్షణ అధికారి (Aerial inspector)

Ready to Land
ఎప్పుడు ఆకలి తొ వుండే ఈ పక్షి పేరు సీగల్ (seagull). నీటి సరస్సుల ప్రక్కన వుండే hotels లొ కూర్చున్న మనుషులు కొంచం వెసులుబాటు ఇస్తే చాలు, వాళ్ళ చేతుల్లొ వుండే తినటానికి అనువయిన ఎ వస్తువైనా లాక్కుని వెళతాయి.

నా చేతిలొ వున్నా కేమేరా తినగల వస్తువొ కాదొ ఒక సీగల్ పరీక్షిస్తుండగా తీసిన చిత్రమిది.

Tuesday, July 17, 2007

చామంతి నవ్వులొ మూగబాసలు

బంతి చామంతి
ఒక వర్షం పడిన మద్యాహ్నం, మా పెరటి లొ వున్న చామంతి మొక్క నా కేమెరా కి పని చెప్పినప్పుడు.