ఈ మధ్య ఒక నది ఒడ్డ్డున కూర్చుని చుట్టు వున్న ప్రకృతి ని ఆస్వాదిస్తు వుండగా, అ ప్రకృతి అందాన్ని వెక్కిరిస్తున్నట్టు గా నది అంచున వున్న ఈ దుంగ నాకు ఎందుకొ మంచి contrast అనిపించింది.మీకు నచ్చినా, నచ్చక పొయినా, ఒక చిన్న మాట కామెంట్ల లొ వదలండి.
ఎప్పుడు ఆకలి తొ వుండే ఈ పక్షి పేరు సీగల్ (seagull). నీటి సరస్సుల ప్రక్కన వుండే hotels లొ కూర్చున్న మనుషులు కొంచం వెసులుబాటు ఇస్తే చాలు, వాళ్ళ చేతుల్లొ వుండే తినటానికి అనువయిన ఎ వస్తువైనా లాక్కుని వెళతాయి.
నా చేతిలొ వున్నా కేమేరా తినగల వస్తువొ కాదొ ఒక సీగల్ పరీక్షిస్తుండగా తీసిన చిత్రమిది.